హైదరాబాద్: యురేనియం తవ్వకాల వ్యవహారం రచ్చ రేపుతోంది. నాటకాలు కట్టిపెట్టాలని మంత్రి కేటీఆర్‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి సెటైర్ వేశారు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ అంశంపై విపక్షాలు, పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించారు. మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని గొప్పగా చెప్పారు. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఓ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్‌పై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగాయి. పవన్‌కల్యాణ్, విజయ్ దేవరకొండ వంటి సినీ సెలబ్రిటీలు, వీహెచ్, రేవంత్ వంటి పొలిటీషియన్లు ఎంటరయ్యాక ఇది పెద్ద ఉద్యమంగా మారుతోందని గ్రహించి.. ఇప్పుడు కేటీఆర్ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ నాటకాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు అనుమతులను రద్దు చెయ్యాలని ట్వీట్ చేశారు.
యురేనియం తవ్వకాల వల్ల నల్లమల అడవుల్లో జీవవైవిధ్యం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలతో క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.