జహీరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ పోటీలో ఊహించని ఫలితం వచ్చింది. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అజహరుద్దీన్ టీంల మధ్య జరిగిన పోరులో… అజహరుద్దీన్ టీంపై రేవంత్ రెడ్డి టీం విజయం సాధించింది. టాస్ గెలిచిన రేవంత్ రెడ్డి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన అజహరుద్దీన్ టీం 15 ఓవర్లకు 130 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రేవంత్ రెడ్డి టీమ్ 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. క్రికెటర్ అజహరుద్దీన్ టీం.. ఈ పోటీలో ఓటమి పాలు కావడం ఆశ్చర్యకరమైతే.. అజహరుద్దీన్ వికెట్‌ను రేవంత్ రెడ్డినే తీయడం విశేషం.
జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్ పేరుతో మాజీ మంత్రి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఈ మ్యాచ్ నిర్వహించారు.