ప్రధాని రాష్ట్ర విభజన కామెంట్స్ పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మోడీకి ప్రధానిగా ఉండే అర్హతే లేదని విమర్శలు చేస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని టార్గెట్ గా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రసంగం రెండు వాస్తవాలను బట్టబయలు చేసిందని చెప్పారు రేవంత్.
1. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్సే తప్ప టీఆర్ఎస్ కాదు
2. బీజేపీ తెలంగాణను ద్వేషిస్తుంది, ఆపార్టీ తెలంగాణ కోసం ఏమీ చేయలేదు
ఈ రెండు విషయాలు ప్రధాని ప్రసంగం ద్వారా తెలిసిపోయాయని అన్నారు రేవంత్. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ హేట్స్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ పెట్టారు రేవంత్.
మంగళవారం మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాని మోడీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారు రేవంత్. మోడీ ఒక్క క్షణం కూడా ప్రధానిగా ఉండే అర్హత లేదన్నారు. ఆయన కామెంట్స్ కు నిరసనగా కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గురించి అన్ని మాటలు అంటుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు.