పీసీసీ చీఫ్ రేవంత్ అనగానే తన మాటలు గుర్తుకొస్తాయి. కేసీఆర్-కేటీఆర్ లపై ఒంటికాళితో లేచే రేవంత్ ను చూసి… పాక్ పై వీరేంద్ర సెహ్వాగ్ షాట్స్ గుర్తుకొస్తాయి. మరోవైపు అజారుద్దీన్ అంటే రాజకీయాలేమో కానీ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు రాజకీయాలను కొద్దిసేపు పక్కనపెట్టి క్రికెట్ ఆడితే….?
అవును… రేవంత్ రెడ్డి టీం వర్సెస్ అజారుద్దీన్ టీంలు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాయి. మధ్యాహ్నం 1గంటకు జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్ పేరుతో మాజీ మంత్రి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ జహీరాబాద్ బాట పట్టాయి. టాప్ లీడర్లంతా కొద్దిసేపు రాజకీయాలను పక్కనపెట్టి క్రికెట్ గేమ్ ఎంజాయ్ చేయబోతున్నారు. అభిమానులను, కేడర్ ను అలరించబోతున్నారు.