సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మూసివేత అంశాన్ని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో ప్రస్థావించారు. స్థానిక మిలటరీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ రహదారులు మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇదే సమస్యను పలు తెలియజేస్తూ.. రహదారులు తెరవాలని కోరామని.. అయితే, దీనిపై రక్షణ శాఖ సరిగా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఈ అంశాలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తడంతో 2018లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో స్థానిక మిలటరీ అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారని రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ సమాధానం చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని కేంద్ర సహాయక మంత్రి తెలిపారు.