టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల దోపిడీ ఇష్టారాజ్యంగా జరుగుతోందని తొలివెలుగు ముందునుంచి చెబుతోంది. కబ్జారాయుళ్లు భూముల్ని ఎలా స్వాహా చేస్తున్నారో ఆధారాలతో సహా వరుస కథనాలు ఇస్తోంది. కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున జరిగిన కబ్జాకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండువేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కానీ.. అది జరుగుతుండగానే లే అవుట్ కు అనుమతి వచ్చింది. దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. దానికి సంబంధించే ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్.
రేవంత్ చేసిన ట్వీట్
‘‘నగరం నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠానాయకుడు ఎవరు? మున్సిపల్ మంత్రి కేటీఆర్ కి తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా? తెలంగాణ సీఎంవో ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్ లు ఇంతలా బరితెగించగలరా? సర్వే నెంబర్ 327లో లే అవుట్ అనుమతులు రద్దు చేయాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలి.
నగరంలో ఇలా చాలా భూములు కబ్జారాయుళ్ల చేతికి వెళ్తున్నాయి. అధికార పార్టీ నేతలు అడ్డూఅదుపు లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే సైలెంట్ గా తమకు చెందిన కంపెనీలకు అప్పగిస్తున్నారని.. ఇంకొందరు కథంతా నడిపించి కమీషన్లు దండుకుంటున్నారని రియల్టర్లు చెబుతున్నారు.