మే 6న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. దీనికోసం వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలు వరంగల్ లో పర్యటించనున్నారు.
6న నిర్వహించే సభా స్థలి ఆర్ట్స్ కాలేజ్ మైదానాన్ని కాసేపట్లో పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నారు. తర్వాత డీసీసీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు రేవంత్. రాహుల్ గాంధీ సభ విజయవంతం చేసేందుకు జరగాల్సిన ప్లానింగ్ పై చర్చించనున్నారు.
రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి వరంగల్ లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం వరంగల్ నుంచి ముఖ్య నాయకులతో ఖమ్మం వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నాయకులతో సమీక్ష జరపనున్నారు.
రేవంత్, కోమటిరెడ్డి వెంట.. మధు యాష్కీ, రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, బలరాం నాయక్ సహా పలువురు నేతలు ఉన్నారు.