ప్రపంచ వేదిక మీద సత్తా చాటి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది ఆర్ఆర్‌ఆర్ చిత్రంలోని నాటునాటు సాంగ్. చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు రావడం పట్ల చిత్ర బృందంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా గర్వపడుతున్నారు.
ఈ క్రమంలో జక్కన్న బృందానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తీసుకుని వచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా మీ బృందానికి ఇవే నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం చరిత్రాత్మకమైన విషయం. సినిమా బృందానికి, దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు.