మిలియన్‌ మార్చ్‌కు రేవంత్ ఎలా వస్తారు...? - Tolivelugu

మిలియన్‌ మార్చ్‌కు రేవంత్ ఎలా వస్తారు…?

revanth will reach to tank bund to attend million march program conducting by rtc jac, మిలియన్‌ మార్చ్‌కు రేవంత్ ఎలా వస్తారు…?

ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్‌కు కార్మికులు రెడీ అవుతున్నారు. మిలియన్‌ మార్చ్‌గా నామకరణం చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఓవైపు కార్మికులు సమాయత్తం అవుతుంటే… పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోవటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

తెలంగాణ ఉద్యమ స్పూర్తిగా మిలియన్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయ. ఈ కార్యక్రమం సక్సెస్‌ చేసేందుకు జేఏసీ, అనుమతి లేని కారణంగా ఎవరూ ట్యాంక్‌బండ్ పరిసరాలకు రాకుండా పోలీసులు…ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అయితే… ఆరోజు టీఆర్ఎస్ ట్రబుల్‌ షూటర్ హరీష్ రావు ఓ నాటు పడవ సహాయంతో హుస్సేన్ సాగర్‌ నుండి ట్యాంక్‌బండ్ చేరుకొని ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడా పాత్ర రేవంత్ రెడ్డి పోషిస్తాడా… ఇటీవల ప్రగతి భవన్‌ ముట్టడి సందర్భంగా నాటకీయ పరిణామాలతో ప్రగతి భవన్‌ గేటును తాకి, కేసీఆర్‌ కు సవాల్ విసిరినట్లుగానే ఇప్పుడు కూడా ట్యాంక్‌బండ్ చేరుకొని మిలియన్‌ మార్చ్‌ను విజయవంతం చేస్తాడా అని అంతా చర్చించుకుంటున్నారు.

అయితే, అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి… మిలియన్ మార్చ్ సమయానికి హైదరాబాద్ తిరిగి రావటం అనుమానమే. తెలంగాణ డెమెక్రాటిక్ సంస్థ ఆద్వర్యంలో ఓ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు రేవంత్ గురువారమే అమెరికా వెళ్లారు. దీంతో… రేవంత్ స్థానాన్ని భర్తీ చేసి, ధైర్యంగా ఇప్పుడు ఎవరు ముందుండి మిలియన్ మార్చ్‌ను సక్సెస్ చేస్తారా… అని ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు.

ఇటు బీజేపీ నాయకులు సైతం ఈసారి మిలియన్ మార్చ్‌లో క్రీయాశీల పాత్ర పోషించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp