రివర్స్ టెండరింగ్ షురూ - reverse tendering process first tendering starts in polavaram from today onwards- Tolivelugu

రివర్స్ టెండరింగ్ షురూ

జగన్ సర్కార్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో ఫస్ట్ టెండరింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం అవుతోంది. పోలవరం ఎడమ కాలువ పనులకు ఇవాళ రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెండర్లను పొందటానికి 6 నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి.

reverse tendering process first tendering starts in polavaram from today onwards, రివర్స్ టెండరింగ్ షురూ

గుంటూరు: పోలవరం ప్రధాన డ్యామ్ నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ. 274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరుల శాఖ ఈ టెండర్లు ఆహ్వానించింది. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకుని ఈ సంస్థలు రివర్స్ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ అంతిమంగా నిర్ణయించింది. పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్​ఫ్రా లిమిటెడ్, ఆప్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్​ఆర్​సీఐఐపీఎల్, డబ్యూసీపీఎల్ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగ్ లిమిటెడ్, ఎంఆర్​కేఆర్ ఎస్​ఎల్​ఆర్ సంయుక్త భాగస్వామ్యంతో మెుత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇవాళ రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp