ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. పండించిన ప్రతి ధాన్యం గింజను రైతు అమ్ముకొని.. వారి అకౌంట్లలో డబ్బులు పడే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రాలకు సమానంగా గన్నీ బ్యాగులను పంపించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి. ఇప్పటికే అన్ని కేంద్రాలకు సమానంగా పంపేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
కొన్ని నల్గొండ, సూర్యాపేట పంపించామని స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు పంట పెరిగిందన్నారు. గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అవన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకు చేస్తున్నా కుట్రలని అన్నారు.
రాష్ట్రంలోని కేంద్రాలకు సరిపోగా.. ఇంకా అదనంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4 కోట్లు గన్నీ సంచులు ఉన్నాయని స్పష్టం చేశారు. రైతును కొనుగోలు కేంద్రానికి పరిమితం చేయాలన్నారు. రైతులను మిల్లు వద్దకు పంపే ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు గంగుల.