ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులను ఆయన అభినందించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంత అధికార దుర్వినియాగం చేసినా.. బెదిరింపులకు పాల్పడినా తమ ఓట్లను తమకే పడేలా చేయడం.. అదనంగా ఓట్లు సాధించడం.. అధికార టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టిందన్నారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసిందన్న రేవంత్.. వాటన్నింటిని ఎదిరించి తమ నేతలు పట్టుదలతో, చిత్తశుద్ధితో పోరాటం చేశారని కొనియాడారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇది రాబోయే రోజుల్లో చేసే పోరాటానికి మంచి స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పారు. సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టిగా పోరాడి విజయం సాధిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.