ఇటీవల కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం ఇలా ఒకటి కాదు రకరకాలుగా ఈ కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి పొగ వల్ల ఈ కాలుష్యం మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రభుత్వాలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటూ కోరుతున్నారు. జనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఇది మరింత పెంచేందుకు, కొనుగోలుదారులకు ఆసక్తి చూపించేందుకు రకరకాల ఆఫర్లను తయారీ సంస్థలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రివోల్ట్ ఆర్ వి 400 కంపెనీ ఓ ఈ బైక్ ను విడుదల చేసింది. ఇది కేవలం తొమ్మిది రూపాయలకే 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందట. అంతేకాకుండా 80 కిలోమీటర్ల స్పీడ్ వరకు దీని రేంజ్ ఉంటుందట.
దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని దీని ధర ఢిల్లీలో 90 వేల 799 రూపాయలని సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభ వార్తనే చెప్పాలి. అలాగే మరొకటి జాయ్ ఈ బైక్.. ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లొచ్చు. గరిష్టంగా 280 కిలోమీటర్ల మైలేజ్ ను ఈ బైక్ ఇస్తుంది. దీని ధర 98,666 రూపాయలు.