కాంట్రావర్శీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనం సృష్టిస్తున్న వర్మ సినిమా రిలీజ్ పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రెండు వర్గాల మధ్య వివాదాలు రేపే విదంగా ఉన్నాయని ఈ సినిమాని నిలుపుదల చెయ్యాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ వర్మ మాత్రం వీటిని లెక్కచేయ్యట్లేదు. సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఈ రోజే సెన్సార్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా A సర్టిఫికేట్ కూడా వస్తుందంటూ ధీమా గా ఉన్నాడు వర్మ.