నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయం వేడెక్కి ఉన్న వేళ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బైపోల్‌పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తనకే ఆ నియోజకవర్గంలో ఓటు ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కే వేసేవాడినంటూ చెప్పారు. ఆయన సెటైర్ వేశారో… లేక సరదాగా అన్నారో తెలియదు కానీ.. ఈ మాటతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసి తాను భగత్‌కు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నానో చెప్పారు.
VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021
చిరుతపులిని తాడుతో కట్టేసి భగత్ కలిసి నడుస్తున్న ఓ వీడియోను షేర్ చేసిన వర్మ.. కేసీఆర్ పులి, కేటీఆర్ సింహం అని తెలుసు కానీ.. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళ్లిన నోముల భగత్‌ను ఇష్టపడలేకుండా ఉండలేకపోతున్న. తనకే నాగార్జుసాగర్ నియోజకవర్గంలో ఓటు ఉండి ఉంటే.. ఈ నెల 17న జరిగే ఉపఎన్నిక పోలింగ్‌లో నోముల భగత్‌కే ఓటు వేసేవాడనంటూ చెప్పుకొచ్చారు. వర్మ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.