వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమానే కాదు… బాలీవుడ్‌లో ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా కూడా చేస్తున్నారు. బ్రూస్‌లీ కథ ఆధారంగా… తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని చెబుతూ… బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.
ఆర్జీవీ సినిమా అంటే ఉండే రొమాన్స్, మహిళలను తన సినిమాలో ఎలా చూపిస్తారో అదేవిధంగా టీజర్‌లోనూ చూపించారు. మార్షల్ ఆర్ట్స్ కోసం తన ప్రేమను కూడా దూరం చేసుకునే అంశంతో తెరకెక్కుతోన్న చిత్రం టీజర్‌ను వర్మ రిలీజ్ చేశారు.
డిసెంబర్ 13న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరీ ఈసారి వర్మ అదృష్టం ఎలా ఉందో చూడాలి.