సంచలన దర్శకుడు ఆర్జీవీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. ఎక్కవగా నిజజీవిత సంఘటనల పై సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రస్తుతం వరంగల్ లోని కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథ ఆధారంగా కొండా సినిమా చేస్తున్నాడు.
అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో ఇందులో నటిస్తున్నారు.ఇక శుక్రవారం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.