సంచలనాలకు మారుపేరయిన వర్మ చేతిలో సినిమాల్లేకే ఇలా వ్యక్తులను టార్గెట్ చేశాడా…? బాలీవుడ్ రేంజ్ ఉన్న వర్మ గ్రాఫ్ పడిపోయిందా…? వర్మకు ఇదేం కర్మ…? ఇవన్నీ వర్మ అభిమానులతో పాటు, సగటు సినీ అభిమానులకు వస్తున్న అనుమానాలే. నిజంగానే ఖాళీగా ఇంట్లో కూర్చోలేక వర్మ ఈ పని మొదలుపెట్టాడా అని తొలివెలుగు టీం ఆరా తీసింది.
అందరు అనుకున్నట్లుగానే వర్మ ఖాళీగా ఏం లేరు. చేతిలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో పాటు మరో రెండు సినిమాలున్నాయి. బ్యూటీఫుల్ అనే సినిమా ప్రొడక్షన్ తో పాటు టూరిస్ట్ అనే మరో సినిమా చేస్తున్నారు వర్మ.
బ్యూటీఫుల్ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయి…ఓ ట్రైలర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇండో చైనా కథ ఆధారంగా టూరిస్ట్ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇవే కాదు మరో మూడు ప‌్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. మరి అవి ఎవరిని టార్గెట్ చేశాయో… ఎంత రచ్చ చేస్తాయో చూడాలి.