కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనం రేపుతున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వస్తున్న ఈ సినిమా బుధవారం సెన్సార్ బోర్డు ముందుకు వచ్చింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ సెన్సార్ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం.
ఒక వైపు రిలీజ్ కు ఒక రోజు సమయం ఉంది. మరో వైపు సినిమా పై వచ్చిన పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణ జరపనుంది. ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ ను అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు అనే టైటిల్ గా మారుస్తున్నట్టు వర్మ ప్రకటించేశాడు. రిలీజ్ డేట్ వచ్చేసిన ఇప్పటివరకు సెన్సార్ పూర్తికాలేదు. కానీ వర్మ మాత్రం రిలీజ్ పై ధీమా గా ఉన్నాడు. టైటిల్ వివాదం నుంచి తప్పించుకోడానికి టైటిల్ అయితే మార్చేశాడు కానీ , ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.