ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ఇప్పుడీ దర్శకుడు మరోసారి బోల్డ్ గా స్పందించాడు. సాధారణంగా పుట్టినరోజులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని వర్మ గతంలోనే ప్రకటించాడు. కానీ ఈమధ్య ఎక్కువగా పుట్టినరోజు పార్టీల్లో కనిపిస్తున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే, సూటిగా స్పందించాడు ఆర్జీవీ.
“పుట్టినరోజులు జరుపుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను బర్త్ డేలు చేసుకోను. కానీ చాలామంది నన్ను బర్త్ డే పార్టీలకు పిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా నన్ను ఆహ్వానిస్తున్నారు. అందమైన అమ్మాయిలు ఆహ్వానించినప్పుడు వెళ్లకుండా ఉండలేం కదా. పైగా పార్టీలకు వెళ్లడం నాకు ఇష్టమే. అలా పుట్టినరోజు పార్టీలకు వెళ్లి, బర్త్ డే విశెష్ చెప్పకుండా డ్రింక్ తాగి వచ్చేస్తుంటాను”
ఇలా మరోసారి తన మార్క్ చూపించాడు వర్మ. ఎవరైనా తనలా బతకాలంటే 3 వదిలేయాలంటున్నాడు ఈ దర్శకుడు. కుటుంబం, సమాజం, దేవుడ్ని వదిలేసినప్పుడు ఎవరైనా తనలా బతకొచ్చని చెబుతున్నాడు.
ఈ దర్శకుడు తీసిన డేంజరస్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కోసం తనదైన ప్రచారంతో ముందుకెళ్తున్నాడు వర్మ.