రాంగోపాల్ వర్మ ఏమి చేసిన అది సంచలనమే అవుతుంది. కరోనా వేళ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఓటిటిలో రిలీజ్ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షించాడు. తాజాగా మర్డర్ చిత్రానికి సంబంధించి పిల్లల్ని ప్రేమించటం తప్పా అంటూ సాంగ్ ను రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.రియల్ లైఫ్ లో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ట్రైలర్ గత మంగళవారం విడుదలై నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు 70 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారని, త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్ కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు.