పవన్ కళ్యాణ్ ను గట్టిగానే కెలుకుతున్నాడు వర్మ. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమాతో వర్మ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో చంద్రబాబు, జగన్, పవన్ చూపించి ఒక సంచలనం సృటించాడు. మళ్ళీ విదేశీయులతో ఒక రాజకీయా సభలో పవన్ డాన్స్ లు వేస్తున్నట్టు ఇంకో పిక్ రిలీజ్ చేశాడు. ఇప్పటికే వర్మ రిలీజ్ చేస్తున్న ఫొటోస్ పై పవన్ ఫాన్స్ నిప్పు చెరుగుతున్నారు.
ఇప్పుడు వర్మ దాన్ని మరింత రెచ్చగొడుతు ఇంకో ఫోటో విడుదల చేశాడు. ఈ సారి లోకేష్ ని కూడా దించేసి పవన్, లోకేష్ ల మధ్య సంభాషణ జరుగుతున్న పిక్ ని వర్మ పోస్ట్ చేశాడు.లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాతో చంచలనం రేపిన వర్మ ఇప్పుడు అదే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. అయితే ఈ సారి పవన్ ని మాత్రం గట్టిగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.