వర్మ ఎవరికీ అర్ధంకాడు అంటారు నిజమే ! వర్మ ఎవ్వరికి అర్ధం కాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన వర్మ ఆ సినిమాకు సంబంధించి రోజుకో విషయం తో బయటకు వస్తున్నాడు. నవంబర్ రెండు ఉదయం 9.36 నిమిషాలకు కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమా నుంచి రెండో పాటని విడుదచేస్తునాను అని ట్వీట్ చేశాడు. ఈ పాట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ మీద ఉంటుందంటూ రాసుకొచ్చాడు. కే ఏ పాల్ పై పాత అని వర్మ ట్వీట్ చెయ్యగానే ఆ పాట ఎలా ఉండబోతుందో అని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. వర్మ ఇప్పటికే కే ఏ పాల్ లుక్ ని కూడా ట్రైలర్ లో చూపించేశాడు.