కన్నడ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా.. హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని.. అందుకే హిందీలోకి సినిమాలను డబ్ చేస్తున్నారు కదా అంటూ కౌంటరిచ్చారు. దీంతో సుదీప్, అజయ్ మధ్య ట్వీట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది.
తాను మాట్లాడిన మాటలు.. ట్రాన్స్లేషన్ పొరపాటు వలన వేరేగా అర్థం చేసుకున్నారంటూ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా అజయ్ దేవగణ్ మాత్రం ట్విట్టర్ వార్ మాత్రం కొలిక్కి రాలేదు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధం పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య.. కిచ్చా సుదీప్‌కు మద్దతుగా హిందీ జాతీయ భాష కాదంటూ అజయ్ దేవగణ్‌కు కౌంటరిచ్చారు.
ఇక దీనిపై తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం సుదీప్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఉత్తరాది తారలకు దక్షిణాది యాక్టర్స్ అంటే అభద్రతా భావంతో పాటు అసూయ పెరిగిపోయాయిందని ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘ఇది కాదనలేని నిజం సుదీప్ సార్.. నార్త్ స్టార్స్ సౌత్ స్టార్స్ పై అసూయతో.. అభద్రత భావంతో ఉన్నారు. ఎందుకంటే.. కన్నడ డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ 2 విడుదలైన రోజే రూ. 50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో హిందీ సినిమాల ప్రారంభ రోజలను చూడబోతున్నాము’ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి.
The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
Advertisements