సంచలనాలు, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హీరోయిన్ కాళ్లపై పడి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. అగస్త్య మంజు దర్శకత్వంలో నిర్మించిన ‘బ్యూటిపుల్’ సినిమా యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ‘ప్రీ న్యూ ఇయర్’ పార్టీని ఘనంగా జరుపుకుంది. ఈ పార్టీకి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు. ఇందులో భాగంగా ‘బ్యూటిపుల్’ నటీ నటులతో కలిసి రాంగోపాల్ వర్మ డ్యాన్సు చేశారు. రాంగోపాల్ వర్మ డ్యాన్సులతో అభిమానులు ఈలలు, అరుపులతో మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత ‘రా కసితీరా’ అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి రామ్ గోపాల్ వర్మ స్టెప్స్ వేశారు. డ్యాన్స్ లో భాగంగా హీరోయిన్ నైనా కాళ్లపై పడ్డారు. ఊహించని ఈ పనికి నైనా షాక్ కు గురై ఒక్కసారిగా కింద కూర్చున్నారు. భావోద్వేగానికి గురై వర్మను పట్టుకున్నారు.
అంతకు ముందు జరిగిన ‘బ్యూటిపుల్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా హీరోయిన్ నైనాతో వర్మ స్టెప్పులేశారు. ‘బ్యూటిపుల్’ ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ ట్యాగ్ లైన్ తో జనవరి 1 న విడుదల కానున్న ఈ సినిమాలో నైనా గంగూలి, సూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.