ఎప్పుడూ ఎదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ మరో సారి తన ట్వీట్ తో నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారడు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వర్మ ఆసక్తికర ట్వీట్లు చేశారు. కాలాన్ని కూడా కరోనా నిలిపివేసిందని, కరోనా తీరు చూస్తుంటే భయం వేస్తోందని పేర్కొన్నారు. “ఇప్పుడేం చేయాలి కరోనా? నెలకు 30 రోజులేమో ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడ్ని, కానీ, ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు ఉన్నట్టుగా అనిపిస్తోంది. టైమ్ అస్సలు కదలడంలేదు. ఏదేమైనా లాక్ డౌన్ పనిచేస్తోందని, దానిముందు కరోనా పనిచేయడంలేదని తెలుస్తోంది” అంటూ స్పందించారు.