జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెరైటీ గా స్పందించారు. ముఖ్యంగా పవన్ పై సెటైర్లతో విరుచుకు పడ్డారు. ‘కేవలం డబ్బు కోసమే తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు.. rip కాపులు..కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు’ అని ఆయన ట్వీట్ చేశారు.
నిజానికి పవన్, చంద్రబాబు భేటీపై మీడియాలో రకరకాల వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుకు సన్నాహాల్లో భాగంగా వారిద్దరూ భేటీ అయ్యారని కొన్ని విశ్లేషణలు వస్తే.. తమ అధినేత చంద్రబాబుతో మాటిమాటికీ సమావేశం కావడాన్ని జనసేన నేతలు, కార్యకర్తలు జీర్చించుకోలేకపోతున్నారన్నది మరో విశ్లేషణ.
. కుప్పం పర్యటనలో చంద్రబాబు ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనపై ఆయనకు సంఘీభావం తెలిపేందుకు తాను ఆయనను కలుసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం. లోగడ వైజాగ్ లో పవన్ కి జరిగిన చేదు అనుభవాలపై చంద్రబాబు ఆయనకు మద్దతుగా మాట్లాడ్డం అంతా.. ఊహించిందేనని అంటున్నారు.
ఇప్పుడు తాజాగా ఆర్జీవీ ..వీరి సమావేశం నేపథ్యంలో చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన తన మరిన్ని ట్వీట్లతో ఎలా చెలరేగిపోతారో వేచి చూడాలి.