ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే సిరివెన్నెల పై మృతి సినీ రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంచలన దర్శకుడు ఆర్జీవీ ట్వీట్టర్ లో ఓ ఆడియో క్లిప్ పోస్ట్ చేశారు. ఆ ఆడియో లో పాట పాడుతూ… ఇంతటి అద్భుతమైన వాక్యాలు రాసిన మీరు కచ్చితంగా స్వర్గానికి వెళతారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ కు నేను చెప్పానని హలో చెప్పండి అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే నేను పోయాక నరకానికి వెళ్తాను… ఒకవేళ యముడు లెక్కలలో తప్పు జరిగి నేను స్వర్గానికి వస్తే బ్రతికి ఉన్నప్పుడు మనం కలిసి వాడ్క తాగలేదు. కాబట్టి అక్కడ స్వర్గంలో కలిసి అమృతం తాగుదాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటిలానే వర్మ పోస్ట్ చేసిన ఈ ఆడియో పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021
Advertisements