ఎన్టీఆర్ పుట్టిన రోజు వచ్చింది… ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్ వస్తుంది ఫ్యాన్స్ కు పండగే అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. అయితే ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సిక్స్‌ప్యాక్ ఫొటో మాత్రం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో ను ఎన్టీఆర్ అభిమానులే కాదు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఫోటోపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
`హే ఎన్టీయార్.. నేను `గే`ను కాననే సంగతి నీకు బాగా తెలుసు. అయితే ఈ ఫొటోలో నిన్ను చూసిన తర్వాత నేను `గే` అయితే బాగుండేది అనిపిస్తోంది. ఆ బాడీ ఎంట్రా నాయనా` అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పుడు వర్మ ట్వీట్ పై నెటిజన్లు జోక్స్ వేసుకుంటున్నారు.
Hey @tarak9999 You very well know I am not a gay but I almost want to become one after seeing u in this pic ..Aaa body yentra nainaa?????? pic.twitter.com/yOCIkOq4yv
— Ram Gopal Varma (@RGVzoomin) May 19, 2020