అసోంలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల జనాభా లెక్కలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 26 నుంచి 28 వరకు కజిరంగా జాతీయ పార్కులో ఈ వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది.
‘కజిరంగా పార్క్ లో ఖడ్గమృగాల జనాభా లెక్కల కోసం 14వ ఖడ్గ మృగ జనాభా అంచనాలు-2022ను మార్చి 26-28 వరకు షెడ్యూల్ చేశాము” అని అధికారులు తెలిపారు.
డివిజన్ ఫారెస్టు అధికారి ఆదేశాల మేరకు జనాభా లెక్కలు సేకరిస్తున్న రోజుల్లో అన్ని రకాల సఫారిలను మూసి వేయనున్నట్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
‘ ఖడ్గమృగాల జనాభా అంచనాలను తప్పని సరిగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు జనాభా లెక్కలు సేకరించే రోజుల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాము” అని తెలిపారు.