భారతదేశం మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రిసాట్-2బీఆర్1) ను ఆంధ్రప్రదేశ్ లోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్ ఎల్ వీ-సీ48 ద్వారాప్రయోగించారు. దీంతో మరో 9 విదేశీ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 50వ ఉపగ్రహ. ఈరోజు మధ్యాహ్నం 3.25 నిమిషాలకు ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహాన్ని ప్రయోగించిన 16 నిమిషాల్లోనే రిసాట్-2బీఆర్1 భూమికి 576 కిలో మీటర్ల పైన కక్ష్య లోకి చేరుకుంది. ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. 628 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం మిలిట్రీ, వ్యవసాయం, అటవీ, డిసాస్టర్ మేనేజ్ మెంట్ సేవలకు ఉపయోగపడుతుంది. 35 సెంటీ మీటర్ల వస్తువులను కూడా గుర్తిస్తుంది. ఎయిర్ స్ట్రయిక్ లకు, టెర్రరిస్టు క్యాంపులను గుర్తించడానికి ఈ నిఘా ఉపగ్రహం మిలిట్రీకి బాగా ఉపయోగపడుతుంది. నిఘా అవసరాల కోసం విదేశీ ఉపగ్రహాల మీద ఆధారపడకుండా ఈ ఉపగ్రహం ఎంతో ఉపయోగపడుతుంది.