ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలుపుతో మంచి ఊపు మీదుంది. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ కు కాస్త విశ్రాంతి సమయం దొరకటం, న్యూ ఇయర్ సందర్భంగా భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు బీసీసీఐ ప్రొటొకాల్ ను ఉల్లంఘించారు. బయో బబుల్ ఒప్పందం ఉన్నప్పటికీ ఓ హోటల్ లో అందరితో కలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినటం లేని చిక్కులు తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు హోటల్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు. ఇదే వారిని ఇరకాటంలో పడేసింది. వీరిని ఐసోలేషన్‌లోకి వెళ్లేలా చేసింది.
వీరిని గమనించిన ఓ భారత్ వ్యక్తి… వారిపై ఉన్న అభిమానంతో వారికి తెలియకుండానే వారి బిల్లు పే చేశాడు. దాదాపు 6700బిల్లును కట్టేశాడు. భారత ఆటగాళ్లు బిల్లు పే చేసే సమయంలో ఇప్పటికే కట్టేశారని హోటల్ వ్యక్తి చెప్పారు. తను అభిమానంతో చేసిన పనికి పంత్ హగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా మాస్క్ లేకుండా. దీంతో ఆ ఐదుగురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉండాలని, ఇతర ఆటగాళ్లతో కలవకూడదని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. వీరికి థర్డ్ టెస్ట్ కు శిక్షణ కూడా ప్రత్యేకంగా ఇవ్వనున్నారు.