• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » కేజీఎఫ్‌2, ఆర్ఆర్ఆర్ ని వెన‌క్కి నెట్టిన‌..!!

కేజీఎఫ్‌2, ఆర్ఆర్ఆర్ ని వెన‌క్కి నెట్టిన‌..!!

Last Updated: October 15, 2022 at 10:38 am

నేడు దేశం మొత్తం కాంతార చిత్రం గురించే మాట్లాడుకుంటోంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి కేజీఎఫ్ 2 త‌ర్వాత అంత‌కు మించి కాంతార మూవీ గురించి చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ఈ చిత్రం భారీ రికార్డు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 15న కాంతార తెలుగులో విడుదల కానుంది. తెలుగు ఆడియన్స్ సైతం మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా కాంతార చిత్రం అరుదైన రికార్డు నమోదు చేసింది. అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన భారత చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

ఇప్పటి వరకు టాప్ లో ఉన్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని కాంతార వెనక్కి నెట్టి మొదటి స్థానం కైవసం చేసుకుంది.కాంతార చిత్రానికి అత్యధికంగా 9.5 రేటింగ్ దక్కింది. మొన్నటి వరకు టాప్ లో ఉన్న కేజీఎఫ్ 2 రెండో స్థానానికి పడిపోయింది. 8.5 ఐఎండీబీ రేటింగ్ తో కెజిఎఫ్ చాప్టర్ 2, 8 రేటింగ్ తో ఆర్ ఆర్ ఆర్ మొదటి రెండు స్థానాల్లో ఉండేవి.

ఇప్పుడు కాంతార ఫస్ట్ ప్లేస్ ఆక్రమించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ ఆర్ ఆర్ ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాలకు పడిపోయాయి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలను కాంతార అధిగమించడం నిజంగా గొప్ప విషయం.దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న కేజీఎఫ్ పార్ట్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఈ క్రమంలో కాంతార సైతం సంచలనాలు చేయనుందా అనే అంచనాలు పెరిగిపోయాయి. కాంతార బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే హిందీ, తెలుగుతో పాటు మలయాళ భాషల్లో భారీ వసూళ్లు సాధించడం ఖాయం.

భూమిపై ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో కాంతార చిత్రం తెరకెక్కింది. హీరో రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించి నటించారు. ఈ క్రమంలో ఒక అద్భుత చిత్రాన్ని తెరకెక్కించిన రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతుంది. కాంతార ఆయనకు నటుడిగా, దర్శకుడిగా భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మరొక విశేషం ఏమిటంటే కేజీఎఫ్ నిర్మాతలైన హోమబుల్ ఫిల్మ్స్ కాంతార చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర హక్కులను అల్లు అరవింద్ దక్కించుకున్నారు.

ఇకపోతే ఇటీవ‌ల కాంతార మూవీని చూసిన కోలీవుడ్ క్రేజీ స్టార్‌ హీరో ధనుష్, సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాంతార సినిమా చూశాక త‌న మైండ్ బ్లాక్ అయ్యింద‌ని, అద్భుతంగా ఉంద‌ని, ప్ర‌తిఒక్క‌రు క‌చ్ఛితంగా చూడాల్సిన సినిమా అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఆ మూవీ హీరో అండ్ డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి గురించి మాట్లాడుతూ ఇలాంటి సినిమాని తెర‌కెక్కించిన నువ్వు గ‌ర్వ‌ప‌డాలి అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆ త‌ర్వాత హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మాత‌ల‌కు అండ్ ఆ సినిమాకి ప‌ని చేసిన కాస్ట్ అండ్ టెక్నిక‌ల్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తూ ధ‌నుష్ ట్వీట్ చేశాడు.

Kantara .. Mind blowing !! A must watch .. Rishab Shetty , you should be very proud of yourself. Congratulations hombale films .. keep pushing the boundaries. A big hug to all the actors and technicians of the film. God bless

— Dhanush (@dhanushkraja) October 14, 2022

Primary Sidebar

తాజా వార్తలు

నిందితుని కోసం ఆపరేషన్..ఇంతలో!

టెన్త్ హాల్ టికెట్స్ వైబ్ సైట్లో..ఆర్టీసీ గుడ్ న్యూస్!

రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత!

చింతకాయల కోసం తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న!

‘మీరా మాకు పాఠాలు నేర్పేది ?’ పాక్ పై ఇండియా ఫైర్

కలలో కృష్ణుడు దర్శనమిచ్చాడు: తేజ్‌ ప్రతాప్‌!

ఉస్మానియా క్యాంపస్ లో టెన్షన్.. టెన్షన్! హై అలర్ట్!

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

ఆసియా కప్‌ పాక్‌ లో.. టీమిండియా మ్యాచులు మాత్రం విదేశాల్లో..!

ఉత్తరాఖండ్ పారిపోయాడా ? గొడుగులో ‘గోవిందా’

50 యేళ్ల వయసులో శాంతి కోసం సైకిల్ యాత్ర …!

లేడీ సీఆర్పీఎఫ్ ల వినూత్న బైక్ ర్యాలీ..!

ఫిల్మ్ నగర్

chandrabose grand entry in india oscar award

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు...!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …  సెల్ఫ్ మేడ్  స్టార్స్ చిట్ చాట్..!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ … సెల్ఫ్ మేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్...!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

IPL 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న ఆటపాట..!

IPL 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న ఆటపాట..!

మైత్రీ మూవీస్ తెచ్చిన ‘ఖుషి’ కబురు...రిలీజ్ డేట్ తో లవ్లీ పోస్టర్...!

మైత్రీ మూవీస్ తెచ్చిన ‘ఖుషి’ కబురు…రిలీజ్ డేట్ తో లవ్లీ పోస్టర్…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap