మెరుగైన చికిత్స కోసం క్రికెటర్ రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ నుంచి ముంబైకి తరలించారు. దీనికోసం డెహ్రాడూన్ నుంచి ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించేందుకు స్పెషల్ గా ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.
పంత్ కు అన్నిరకాల వైద్య సదుపాయాల్ని అందించేందుకు బీసీసీఐ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. బీసీసీఐ వైద్యులు పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.
అవసరమైతే పంత్ ను లండన్ కు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అధ్యక్షుడు జైషా కూడా ఆరా ఎప్పటికప్పడు తీస్తున్నారు.
కాగా డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పంత్ త్వరగా కోలుకుని మళ్లి క్రికెట్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.