ఇండియన్ క్రికెటర్ పంత్ ఫెయిల్యూర్ పరంపర కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో కేవలం 10 పరుగులకే పరిమితమై పెవిలియన్ దారిపట్టాడు. మిచెల్ బౌలింగ్ లో.. ఫిలిప్స్ దోసిలికి దొరికేసాడు.
ప్రమాదంలో ఉన్న జట్టుని గట్టెక్కిస్తాడనుకున్నతమ ఆశల్ని పంత్ పటాపంచలు చేసాడని అభిమానులు ఉసూరుమన్నారు. సంజూ శాంసన్ అభిమానులైతే సోషల్ మీడియాలో కామెంట్ల స్కోర్ చేసారు. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి ఇదేం ఆటని.. పంత్ ను వంతుల వారీగా ఆడుకున్నారు. పంత్ ని పక్కన పెట్టి శాంసన్ కు ఛాన్స్ ఇవ్వడం ఉత్తమమని డిమాండ్ పోస్టులు దంచికొట్టారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా సంజూకి తోడుగా నిలిచాడు. అతను సమర్ధుడైన ఆటగాడని.. అంబటి రాయుడిలానే అవకాశాలివ్వకుండా పక్కన పెడుతున్నారని విమర్శలు గుప్పించాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో శాంసన్ కు సరైన అవకాశివ్వకుండా సెలక్టర్లు నీరుగార్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని కనేరియా ఆరోపించాడు.
న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేలో సమర్థంగా ఆడిన సంజూ సెకెండ్ వన్డేలో ఎగస్ట్రాగా పక్కన పెట్టడాన్ని ఎద్దేవ చేసాడు. అంబటి రాయుడి విషయంలో ఇలాగే ఆప్షన్ ఇచ్చి విజయ్ శంకర్ కు అవకాశమిచ్చి చాలా తప్పుచేసారని.. ఇప్పుడు కూడా అదే వైఖరి బీసీసీఐ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు.