వంటింట్లో గ్యాస్ మండిపోతోంది. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్య కుటుంబాల గుండెల్లో గుదిబండలా మారాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. మరో వైపు వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి.
చమురు ధరల పెరుగుదలతో సామాన్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 14 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి సమురు సంస్థలు. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
దీంతో హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1002కి చేరింది. అటు దేశంలో ఇంధన ధరలు కూడా పెరిగాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగింపు, ఉక్రెయిన్ లో యుద్దం కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు ధరలు పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.