రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భానుడు భగభగ మండుతున్నాడు. సోమవారం మాడు పగులగొట్టాడు. ఇంకో నాలుగురోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి.. ఇంటీరియర్ కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించారు.