ప్రస్తుతానికి కొవిడ్-19 ప్రమాదం తప్పిందని కానీ భవిష్యత్ లో ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ…
ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం కరోనా వైరస్ నుండి నిర్దిష్ట స్థాయి రక్షణను సాధించిందని చెప్పారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్, ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గిందన్నారు.
అయితే భవిష్యత్ లో మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉందని అని తెలిపారు. అది కరోనాతో పోలిస్తే డిఫరెంట్ గా ఉండవచ్చన్నారు.
ఇప్పుడు మనం మెడికల్ టెక్నాలజీ మీదా వీలైనంత పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. అప్పుడే భవిష్యత్ లో వచ్చే ప్రాణాంతక వ్యాధులపై ప్రపంచం సమర్థవంతంగా పోరాటం చేయగలదని వెల్లడించారు.