వెండితెర నటులకు దీటుగా బుల్లితెర నటులు పేరు సంపాధించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో రియాల్టీ షోలకే ఎక్కువ పాపులారిటీ లభించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. జబర్ధస్త్ షోతో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో పాటు.. హైపర్ ఆది కూడా ఎంతో పాపులర్ అయ్యారు. తన పంచ్ ల టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది.
అయితే.. సుధీర్ యాంకర్ గా చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాంప్రసాద్, ఆది.. వారివారి స్టైల్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులే కాదు ఆర్టిస్టుల మనసులను కూడా దోచేస్తున్నారు. అయితే.. తాజాగా ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఆదికి అనుకోని సంఘటన ఎదురైంది. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి హైపర్ ఆదికి లవ్ ప్రపోజ్ చేసింది. అయితే.. ఇందంతా షోలో భాగమే అయినప్పటికీ.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
టీఆర్పీ స్టంట్ పేరుతో కొత్త డ్రామా క్రియేట్ చేశారు. దీనిలో భాగంగా నటులంతా టీఆర్పీ కోసం షాకింగ్ గా ఏమైనా చేయాలి. ఈ నేపథ్యంలో నూకరాజు రీతూ చౌదరిని ప్రశ్నిస్తూ.. నువ్వు గతంలో ఓ ఛానల్ లో ఒకరిని హగ్ చేసుకున్నావు.. ఆ తర్వాత అజార్ అంటే ఇష్టం అని చెప్పావు. అసలు నువ్వు నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడిగాడు.
అందుకు స్పందించిన రీతూ చౌదరి.. తన మనసులో మాట బయట పెట్టింది. నేను నిజంగానే ప్రేమిస్తున్న వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు అంటూ హైపర్ ఆది చేయి పట్టుకుంది. అందరూ చూస్తుండగానే మోకాళ్లపై కూర్చొని ‘ఐలవ్యూ’ చెప్పేసింది. హైపర్ ఆది తనపై కామెడీ పంచ్ లు వేసినా నాకు ఇష్టమే.. ఎందుకంటే ఆ సమయంలో అయినా ఆదితో మాట్లాడవచ్చు అంటూ.. ఆదిపై తన ఇష్టాన్ని బయట పెట్టింది. దీంతో సెట్ లో ఉన్న వారందరికి మైండ్ బ్లాక్ అయ్యాయి.