శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతువర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. డైరెక్టుగా ఓటీటీ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీతూ వర్మ మాట్లాడుతూ..తన పాత్ర కు సంబంధించి కొన్ని విషయాలను పంచుకుంది.
ఇప్పటి వరకు చేసిన రోల్స్ కన్నా…ఇదే ప్రత్యేకమైనది అని అన్నారు. గవర్నమెంట్ ఆఫీసర్‌గా అధికారాన్ని చూపించే పాత్రలో గుమ్మడి వరలక్ష్మీగా కనిపించబోతున్నట్లు తెలిపింది. ఇది కచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా అని బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ వేరేలా ఉంటుందని.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.