సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్ లో పెను దుమారమే లేచింది. సుశాంత్ ఆత్మహత్య కు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక సింగ్ సుశాంత్ పట్ల ప్రవర్తించే తీరుపై అతడు భాధ పడేవాడని ఈ మేరకు తనతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను రియా షేర్ చేసింది. ఆ వాట్సాప్ చాట్ చూస్తే సుశాంత్ కలత చెందాడని తెలుస్తుందని రియా చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా తమ మధ్య దూరం పెంచడానికి సుశాంత్ రూమ్మేట్ సిద్ధార్ధ్ ని ప్రియాంక ప్రేరేపించేదని వాట్సాప్ మెసేజ్‌లలో రియాతో సుశాంత్ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్‌షాట్లలో ప్రస్తావించింది. మరో వైపు రియా చేస్తున్న ఆరోపనలపై సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ స్పందించారు. సుశాంత్ తనతో కూడా సరదాగా ఉండేవాడని ప్రియాంకతో కూడా అలాగే ఉండేవాడని తెలిపింది. ప్రియాంక సుశాంత్ లు అన్యోన్యంగా ఉండేవారని సుశాంత్ ఒక ఇంటర్వ్యూ లో తన సోదరి గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.