ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన (39) మంగళవారం కన్నుమూశారు. గుండెల్లో నొప్పిగా ఉన్నట్టు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఆమె తెలిపింది. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించారు.
ఆమె అకాల మరణ వార్త అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె మృతి పట్ల కన్నడ టీవీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మరణ వార్త తెలియగా అందరికన్నా ముందుగా నటి శ్వేత చెంగప్ప స్పందించారు.
‘ నా అభిమాన రేడియో జాకీల్లో ఆమె ఒకరు. చాలా సున్నిత మనస్కురాలు. కన్నడ భాషపై ఆమెకు చాలా మంచి పట్టు ఉన్నది. ఆమెను ఇప్పటివరకు వ్యక్తిగతంగా కలవలేకపోయాను. ఆమెను కలిసే అవకాశం ఇక దొరకదన్న వార్త వింటుంటే తీవ్ర వేదన కలుగుతోంది. ఇక ఆమె లేరు అన్న వార్త చాలా బాధ కలిగిస్తోంది ” అని అన్నారు.
గత కొంత కాలంగా ఆర్ జే రచన మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మిత్రులకు కూడా ఆమె దూరంగా ఉంటున్నట్టు వారు పేర్కొన్నారు.