బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని, ఇందుకు బీజేపీకి ఎన్నికల సంఘం అండగా నిలిచిందంటూ వ్యాఖ్యానించారు. బీహార్ ఓటర్లు మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారన్నారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, బీహార్ ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలిచిన అనేక చోట్ల కేవలం వెయ్యిలోపు ఓట్ల మెజారిటీ వచ్చిందని… అక్రమాలు చేశారంటూ కాంగ్రెస్ సైతం ఆరోపించింది.
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ… కాంగ్రెస్ అనుకున్నమేర గెలవకపోవటంతో అధికారాన్ని సీట్లకు పోటి చేసి కేవలం 19సీట్లు మాత్రమే గెల్చుకుంది. ఈ ప్రభావం మహాకూటమి పై పడింది.