రవిప్రకాశ్ అరెస్టు దుర్మార్గం: ఆర్జెడీ నేత -rjd leader tejaswi yadav reacted on ravi prakash illegal arrest - Tolivelugu

రవిప్రకాశ్ అరెస్టు దుర్మార్గం: ఆర్జెడీ నేత

ఢిల్లీ: రవిప్రకాశ్ అక్రమ అరెస్టు వ్యవహారంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా దిగ్గజాలు వినోద్ కాప్రీ, స్వాతి చతుర్వేది, రోహిణీ సింగ్, మహేశ్, సాక్షిజోషి, ఇంకా అనేకమంది నేషనల్ మీడియా ప్రముఖులు రవిప్రకాశ్ అక్రమ అరెస్టును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపిస్తున్నారు.

rjd leader tejaswi yadav reacted on ravi prakash illegal arrest, రవిప్రకాశ్ అరెస్టు దుర్మార్గం: ఆర్జెడీ నేతవినోద్ కాప్రీ చేసిన ట్వీట్‌కు ఆర్‌జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. రవిప్రకాశ్ అరెస్టు అత్యంత దుర్మార్గం (Sad state of affairs) అని తేజస్వీ యాదవ్ విచారం ప్రకటించారు. రవిప్రకాశ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్టులు చేపట్టిన ఉద్యమానికి మద్ధతు ప్రకటించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp