– ఆర్ఎల్ డీ చీఫ్ జయంత్ చౌదరీ
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే హిమాంత శర్మపై పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. తాజాగా హిమాంత శర్మకు రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అసోం సీఎం ఎప్పటికప్పుడూ ఇతరులను అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు. బీజేపీ నేతల నోరు ఎప్పుడు చూసినా కంపుకొడుతోంది. అందువల్ల వాళ్లు పళ్ల పొడి లేదా వేప పుల్లతో పళ్లు తోముకుంటే మంచిది” అని అన్నారు.
రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘ ఈ వ్యక్తుల మనస్తత్వం చూడండి. మన దేశానికి జనరల్ బిపిన్ రావత్ గర్వకారణం. ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ పై మనం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాము. అయితే వాటికి రాహుల్ గాంధీ ప్రూఫ్ అడుగుతున్నారు” అని అన్నారు.
‘ఆయన రాజీవ్ గాంధీ కొడుకేనా అని ఎప్పుడైనా మనం ప్రూఫ్ అడిగామా. ఆయనకు ఏమి హక్కు ఉందని ఆర్మీని వివరాల కోసం డిమాండ్ చేస్తున్నారు” అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటంటూ పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.