హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్‌కేసర్ పరిధిలోని అవుషాపూర్ గ్రామం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరు పురుషులు, ఒక మహిళ బైక్ పై బీబీనగర్ నుండి ఉప్పల్ కి వైపుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారు ప్రయత్నిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియలేదు.