హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యాక్టీవా బైక్‌ను గుర్తు తెలియని కారు ఢీకొట్టి ఎస్కేప్ అయింది. ఈ యాక్సిడెంట్ లో యాక్టీవా వాహనదారుడికి గాయాలయ్యాయి.
దీంతో వెంటనే స్థానికులు బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అందిచగా.. హుటాహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించాడు. అతని సోదరుడు వచ్చి నచ్చజెప్పి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.