ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటికి డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ముఖ్యమైన కారణాలుగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జడ్చర్ల మహబూబ్ నగర్ వద్ద కంటెయినర్ ని ఈ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తలకి బలమైన గాయం అవ్వడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి.
కాగా వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.