డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహేశ్వరం తుమ్మునూరు వద్ద కారును డీసీఎం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
మృతులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరసు రామస్వామి రామస్వామి (36), బికనీ యాదయ్య (35), కేశవులు (33), మోతా శ్రీను (35) గా గుర్తించారు. వీరంతా స్విఫ్ట్ కారులో వెల్దండ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. తుమ్మలూరు గ్రామం సమీపంలోని ఎంఏకే ప్రాజెక్ట్ వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది.
దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించినట్టు పోలీసులు వెల్లడించారు.