జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల దుర్గామాత ఆలయం సమీపంలో సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో భారీ కుంభకోణం బయపడింది. గంజాయి రవాణా చేస్తున్న యువకుడు అడ్డంగా దొరికొపోయాడు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్, వినయ్, జాన్, మహేశ్ లు విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా చేస్తుంటారు.
వీరు విశాఖ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి సంచితో హైదరాబాద్ బయల్దేరారు. నెల్లుట్ల వంతెన వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి కింద పడిపోయారు. గమనించిన స్థానికులు అతన్ని లేపి కొన్ని మంచినీళ్లు తాపించారు. అనంతరం అతన్ని పరిశీలించి అతని వద్ద ఉన్న సంచిలోని గంజాయిని షాక్ అయ్యారు.
నిందితున్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. అతని వద్ద నుండి సుమారు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై రఘుపతి తెలిపారు.
గంజాయ్ ఎక్కడినుండి తీసుకొస్తున్నారు.. ముఠాలో ఎంత మంది ఉన్నారు.. అసలు దాని వెనక ఉన్నదెవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఎస్సై వివరించారు. కాగా.. తనతోపాటు ఉన్న మరో ముగ్గురు ద్విచక్ర వాహనంపై పారిపోయారని.. తన బైక్ స్టార్ట్ కాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయాని నిందితుడు మహేశ్ అంగీకరించినట్టు తెలిపారు ఎస్సై.